మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తవ్యగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో మేరీలాండ్‌ గవర్నర్‌ పదవి కోసం డెమోక్రటిక్‌ నాయకుడు వెస్‌ మూర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్థానానికి అరుణా మిల్లర్‌ పోటీ చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు.  గవర్నరశ్రీన్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఆబాధ్యతలు అప్పగిస్తారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెప్టినెంట్‌ గవర్నర్‌ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

 

Tags :
ii). Please add in the header part of the home page.