ప్రధానికి గుజరాత్‌లో ప్రచారం చేసే అవసరం ఏంటి?.. అశోక్ గెహ్లాట్ విమర్శలు

ప్రధానికి గుజరాత్‌లో ప్రచారం చేసే అవసరం ఏంటి?.. అశోక్ గెహ్లాట్ విమర్శలు

దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోదీ తన సమయం మొత్తాన్ని గుజరాత్‌కే కేటాయిస్తున్నారంటూ కాంగ్రెస్ కీలక నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శల వర్షం కురిపించారు. దేశ ప్రధాని వెళ్లి గుజరాత్‌లో ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో మనం చూస్తున్న అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ పాలన వల్లనే జరిగిందని, ఆర్ధిక స్వాతంత్ర్యం లభించిన తర్వాతనే మోదీ ప్రధానమంత్రి అయ్యారని గెహ్లాట్ అన్నారు. ప్రతి విషయంలో కాంగ్రెస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి చూడటం మానుకోవాలని సూచించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

Tags :