కరోనా ఎఫెక్ట్..ఏషియన్ గేమ్స్ వాయిదా

కరోనా ఎఫెక్ట్..ఏషియన్ గేమ్స్ వాయిదా

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఏషియన్‌ గేమ్స్‌ వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రీడలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. హాంగ్జూ పట్టణంలో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఏషియన్‌ గేమ్స్‌ జరగాల్సి ఉన్నాయి. అయితే చైనాలో కరోనాకు కేంద్రంగా ఉన్న షాంఘైకి సమీపంలోనే హాంగ్జూ పట్టణం ఉన్నది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి షాంఘైలో గత కొన్ని వారాలుగా కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కాగా ఏషియన్‌ గేమ్స్‌ కోసం హాంగ్జూ సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

Tags :