ప్రజా విశ్వాసం లేని కేసీఆర్ - అస్సాం సిఎం

ప్రజా విశ్వాసం లేని కేసీఆర్ - అస్సాం సిఎం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, నైజాంలను మించిన నిరంకుశ పాలనతో విసుగుచెందిన ప్రజలు ఆయనను ఎప్పుడెప్పుడు దించేద్దామని చూస్తున్నారని, ఇప్పుడాయనకు పోలీసులు తప్ప ఎవరి మద్దతూ లేదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నేత హిమంత్‌ బిశ్వ శర్మ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్‌ రోడ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిలో లక్షమందికి ఉద్యోగాలను కల్పించగా, కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగులను పరేషాన్‌ చేస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దన్న సీపీఎం తదితర పార్టీలను ఇంటికి పిలిచి కేసీఆర్‌ దావత్‌ ఇచ్చారని, రాష్ట్రం ఏర్పాటు ఆశయానికి విరుద్ధంగా వెళుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను చూసి ఏదైనా నేర్చుకుందామని వచ్చానని, కానీ నేర్చుకోవడానికి ఇక్కడ ఏం లేదన్నారు.  సీఎం కేసీఆర్‌ను కచ్చితంగా జైలుకు పంపిస్తామని, సొరంగంలో దాక్కున్నా వదలబోమని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 13 జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు రాలేదని పేర్కొన్నారు. గూగుల్‌లో వేస్ట్‌ ఫెలో ఆఫ్‌ ఇండియా అని కొడితే కేసీఆర్‌ పేరే వస్తోందని ఎద్దేవా చేశారు. 

 

Tags :