అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోంలో వరదలపై దృష్టి పెట్టకుండా శివసేవ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌ ఆతిథ్యమిచ్చారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు ఉందని పేర్కొన్నారు. మహా సంక్షోభంలో జోక్యం చేసుకోనని తెలిపారు. అసోంకు వచ్చే అతిథులు ఎవరైనా వారికి రక్షణ కల్పించడం మా బాధ్యత అన్నారు.

 

Tags :