అరుదైన టీ పొడి.. కిలో రూ.లక్ష

అరుదైన టీ పొడి.. కిలో రూ.లక్ష

అస్సాంలో లభించే అరుదైన టీ రకాల్లో ఒకటైన పభోజన్‌ గోల్డ్‌ టీకి భారీ ధర లభించింది. జోర్హాట్‌లో జరిగిన వేలంలో ఏకంగా కిలో రూ.లక్షకు అమ్ముడు పోయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా చెబుతున్నారు. అస్సాం గోలఘాట్‌ జిల్లాలో ఈ అరుదైన సేంద్రీయ టీ ఉత్పత్తి అవుతుంది. పభోజన్‌ ఆర్గానిక్‌ టీ ఎస్టేట్‌ నుంచి అస్సాంకు చెందిన టీ బ్రాండ్‌ ఎసా టీ దీన్ని కొనుగోలు చేసింది. ఈ టీ ప్రత్యేక రుచి దీని విలువను ఇష్టపడే కొనుగోలుదార్లు అంతర్జాతీయంగా ఉన్నారని సంస్థ తెలిపింది.

 

Tags :