అమెరికాలో దుర్ఘటన

మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో దుర్ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. సాల్వడార్ లీగ్‌లో భాగంగా అలియంజా, ఎఫ్‌ఏఎస్ క్లబ్బుల జట్ల మధ్య కస్కట్లాన్‌లోని ఓ స్టేడియంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా దానికి భారీ సంఖ్యలో అభిమానులు పొటెత్తారు. ప్రవేశద్వారం వద్ద తొక్కిసలాట జరగడంతో ప్రాణనష్టం సంభవించింది.
Tags :