అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలరాడోని గేనైట్‌ క్లబ్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఐదుగురు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు.  రాత్రి 11:57 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ సాయుధుడు కాల్పులు జరుపగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిగిపన వ్యక్తిన అదుపులోకి తీసుకున్నారు.  కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ట్రాన్స్‌ ఫోబియా కారణంగా హత్యకు గురైనవారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్‌ 20న ట్రాన్స్‌జెండర్‌ ఆఫ్‌  రిమెంబరెన్స్‌ వేడుక నేపథ్యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.