అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వర్జీనియాలోని ప్రముఖ వాల్‌మార్ట్‌ స్టోర్‌ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. నిందితుడు అదే స్టోర్‌లో పనిచేస్తోన్న మేనేజర్‌గా తెలుస్తోంది. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35`40 నిమిషాల పాటు జరిపిన ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఇటీవల కాలంలో జరిగిన భీకర కాల్పుల ఘటన ఇదేనని పోలీసులు తెలిపారు. ఘటనపై వాల్‌మార్ట్‌ సంస్థ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.  క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.