ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సిలో ఆహారసామాగ్రి పంపిణీ

ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సిలో ఆహారసామాగ్రి పంపిణీ

అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని లాంగ్‍ బ్రాంచ్‍ పట్టణంలో అన్నార్తులకి ఆహార సామాగ్రిని పంపిణీ చేశారు. దాదాపుగా  500 కుటుంబాలకి నెల రోజులు సరిపడే ఆహార పదార్ధాలను ఆ ప్రాంత ఆటా సమన్వయ కర్తలు ప్రదీప్‍, ప్రవీణ్‍, విలాస్‍, సంతోష్‍ కోరం సేకరించి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం లో లాంగ్‍ బ్రాంచ్‍ మేయర్‍ జాన్‍ పలోన్‍, ఆటా ప్రెసిడెంటు భువనేశ్‍ బూజాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్‍ మాట్లాడుతూ కోవిడ్‍ సెకండ్‍వేవ్‍ వల్ల భారత దేశంలో ఎంతోమంది కష్టాలు పడుతున్నారని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్ళను ఆదుకునేందుకు ఆక్సిజెన్‍ కాన్సన్ట్రేటర్‍ లు పంపడంతోపాటు అమెరికాలో కూడా వివిధ పట్టణాలలో నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటా నాయకులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :