ఆటా కార్యక్రమాలను విస్తరిస్తాం...మధు బొమ్మినేని

ఆటా కార్యక్రమాలను విస్తరిస్తాం...మధు బొమ్మినేని

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మధు బొమ్మినేని మాట్లాడుతూ, భవిష్యత్‌ లక్ష్యాలు, ఆటా రోడ్‌ మ్యాప్‌ వివరాలను పంచుకున్నారు. ఆటా సభ్యులంతా నిబద్ధత, ఐక్యత, బాధ్యతతో సమాజసేవలో ముందుండాలని తెలిపారు. అక్షరాస్యత, సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ప్రాథమిక లక్ష్యాలకు ఆటా కట్టుబడి ఉంటుందన్నారు. యువతరాన్ని భాగస్వామ్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సాహించడం, ఆటా కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని మధు బొమ్మినేని తెలిపారు.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని పెంచడం,  ఆటా సేవ, అవసరమైన వనరులతో మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలు కల్పించడం, విద్యార్థి సేవలతో పాటు, సమాచార మరియు ఆరోగ్య సేవల కార్యక్రమాలకు తన పదవీ కాలంలో మరింత ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా ‘ఆటా’కు సేవలందించిన అధ్యక్షులు భువనేశ్‌ భూజాల మరియు సభ్యులను మధు బొమ్మినేని అభినందించారు.

 

 

 

Tags :