రివ్యూ: అతి ఎక్కువైన 'అతిథి దేవోభవ'

రివ్యూ: అతి ఎక్కువైన 'అతిథి దేవోభవ'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
బ్యానర్ : శ్రీనివాస క్రియేషన్స్,
న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి, ఆదర్శ్‌ బాల‌కృష్ణ త‌దిత‌రులు నటించారు  
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్, ఛాయాగ్ర‌హ‌ణం:  అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి,
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల‌, అశోక్ రెడ్డి మిర్యాల‌,
ద‌ర్శ‌క‌త్వం:  పొలిమేర నాగేశ్వ‌ర్‌,
విడుద‌ల తేదీ: 07.01.2022

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్‌’ 'వాలిమై' వంటి భారీ సినిమాల‌తో హుషారుగా మొద‌లు కావాల్సిన ఈ ఏడాది ఆరంభం ఓమిక్రాన్ వేరియంట్ క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల త‌ల‌కిందులైంది. ఈ పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో.. చిన్న చిత్రాలు వరుస క‌ట్టాయి. ‘ప్రేమ కావాలి’,  ‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ ఖాతాలో మరో హిట్‌ లేదు. వరుస పెట్టి  చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా  'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం (జవవరి 7)న ఆహ్వానం పలికాడు.  మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘ప్రేమ కావాలి’,‘లవ్లీ’ సినిమాల తర్వాత యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ ఖాతాలో మరో హిట్‌ లేదు. వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి. సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు ఆది. తాజాగా ఈ యంగ్‌ హీరో 'అతిథి దేవో భవ’ అంటూ శుక్రవారం(జవవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:

అభి అలియాస్‌ అభయ్‌రామ్‌ (ఆది సాయికుమార్‌) చిన్నప్పటి నుంచి మోనో ఫోబియాతో (ఒంట‌రిగా ఉండ‌టాన్ని చావుతో స‌మానంగా భావించడం). బాధపడుతుంటాడు. ఒంటరిగా ఉండలేదు. నిమిషాల్లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డే ప్ర‌య‌త్నం చేస్తాడు. త‌న‌కున్న ఈ లోపం కార‌ణంగానే ఎంతోగానో ప్రేమించిన ఓ అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ఆ బాధ‌లో ఉన్న స‌మ‌యంలోనే వైష్ణ‌వి (నువేక్ష‌) అత‌ని జీవితంలోకి ప్ర‌వేశిస్తుంది. తొలి చూపులోనే ఒక‌రిపై మ‌రొక‌రికి ప్రేమ క‌లుగుతుంది. అయితే త‌న లోపం గురించి తెలిస్తే ఆమె కూడా దూర‌మ‌వుతుంద‌నే భ‌యంతో ఆ విష‌యాన్ని దాచి పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ క్ర‌మంలో వారి ప్రేమ‌కు అనుకోని స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల అభిని సైకోగా భావించి పోలీసులు అరెస్టు చేయాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? అస‌లు అభ‌య్‌కు ఎదురైన స‌మ‌స్య‌లేంటి? ఆ చిక్కుల నుంచి అతడెలా బ‌య‌ట‌ప‌డ్డాడు? త‌న ప్రేమ‌ను ఎలా కాపాడుకున్నాడు? అన్న‌ది తెర‌పై చూడాలి.

నటి నటుల హావభావాలు:

అభయ్‌ పాత్రకి న్యాయం చేశాడు ఆది సాయికుమార్‌. నటనలో కొత్తదనం ఏమీ లేదు. మోనోఫోబియాతో భ‌య‌ప‌డే స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.  వైష్ణవి పాత్రలో నువేక్ష చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. న‌ట‌న ప‌రంగా ప్ర‌తిభ చూపించ‌డానికి పెద్ద‌గా ఆస్కారం దొర‌క‌లేదు.  ఆది త‌ల్లి పాత్ర‌లో రోహిణి ఎంతో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇక హీరో తల్లిగా రోహిణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హీరో స్నేహితుడిగా సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇమ్మాన్యుయేట్‌, అదుర్స్‌ రఘు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: 

మ‌నిషికున్న లోపాల‌ను ఆధారం చేసుకోని తెర‌కెక్కిన క‌థ‌లు తెలుగులో చాలానే ఉన్నాయి. ఇలాంటి క‌థ‌ల‌ను వినోదాత్మ‌కంగా రూపొందించిన ద‌ర్శ‌కుడు మారుతీ ఆయ‌న నుంచి వ‌చ్చిన ‘భలే భ‌లే మ‌గాడివోయ్‌’, ‘మ‌హానుభావుడు’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి చిత్రాల‌న్నీ ఈ త‌ర‌హా క‌థాంశాల‌తో రూపొందిన‌వే. ఒక‌దాంట్లో మ‌తిమ‌రుపును, మ‌రొక‌దాంట్లో అతిశుభ్ర‌త‌ను, ఇంకోదాంట్లో అతిభ‌యం.. అనే పాయింట్ల‌ను వినోదాత్మ‌కంగా చూపించి క‌డుపుబ్బా న‌వ్వించారు. గతంలో వచ్చిన ఆ రెండు చిత్రాలు వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించాయి. ఈ మూవీలో ఆ రెండూ లేవు.‘అతిథి దేవోభ‌వ‌’ కూడా ఈ త‌ర‌హా క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే. అయితే  సినిమాలో కాస్త కాల‌క్షేపంగా నిలిచిన ఎపిసోడ్స్ అవే. ఎంచుకున్న క‌థలో కాస్త కొత్త‌ద‌న‌మున్నా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చుకోవ‌డంలో క‌థ‌కుడు, ద‌ర్శ‌కుడు పొలిమేర నాగేశ్వ‌ర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. సినిమాకి బ‌లాన్నిచ్చిన అంశ‌మేదైనా ఉందా అంటే, అది శేఖ‌ర్ చంద్ర అందించిన సంగీత‌మే. ‘‘బాగుంటుంది నువ్వు న‌వ్వితే’’, ‘‘నిన్ను చూడ‌గానే’’, ‘‘చిన్ని బొమ్మ న‌న్నిలా..’’ పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. కార్తిక్ క‌త్తెర‌కు మ‌రింత ప‌ని చెప్పాల్సింది. అమ‌ర్‌నాథ్ ఛాయాగ్ర‌హ‌ణం ఫ‌ర్వాలేద‌నిపించింది. చిత్ర నిర్మాణ విలువ‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

విశ్లేషణ:

ప్ర‌ధ‌మార్ధంలో కామెడీ థ్రిల్ల‌ర్‌గా క‌థ‌ను నడిపే ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్ధంలో కాసేపు దాన్ని సైకో థ్రిల్ల‌ర్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న వేసిన ప్ర‌తి ఎత్తుగ‌డ సాగ‌తీత వ్య‌వ‌హారంలాగే న‌డిచింది త‌ప్ప‌.. ఎక్క‌డా ఊపు తీసుకురాలేక‌పోయింది.  అభ‌య్‌ను సైకోగా భావించి పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ట్లు అనిపించినా.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఎపిసోడ్‌తో అదంతా నీరుగారిపోతుంది. యాక్ష‌న్ సీక్వెన్స్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు కాస్త కాల‌క్షేపాన్నిస్తాయి. ఇక ముగింపుకు ముందు అభ‌య్ - వైష్ణ‌వి తిరిగి క‌లిసిన తీరు.. ప్ర‌తినాయ‌కుల‌కు అభికి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఏమాత్రం రుచించ‌వు.  కానీ అది అంతగా వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాసేపు థ్రిల్‌ ఇవ్వాలని ట్రై చేశాడు. అదీ  కూడా వర్కౌట్‌ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సిన రోజున ఈ చిత్రం  విడుదల అయ్యి సినీ ప్రేక్షకుడిని నిరాశ పరిచింది.  

 

Tags :