మిస్ సౌత్ ఇండియాగా ఏయూ విద్యార్థిని

మిస్ సౌత్ ఇండియాగా ఏయూ విద్యార్థిని

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా గా ఎంపికయ్యారు. పెగాసస్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలువురు యువతులు పోటీల్లో పాల్గొనగా విశేష ప్రతిభ కనబరిచిన ఛరిష్మా కృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా ఆమె రాణిస్తున్నారు.

 

Tags :