ఇవైవ్‌ బయోటెక్‌తో అరబిందో సంస్థ ఒప్పందం

ఇవైవ్‌ బయోటెక్‌తో అరబిందో సంస్థ ఒప్పందం

అమెరికా మార్కెట్లో రైజ్‌న్యూటా ఔషధ విక్రయాలకు సంబంధించి ఇవైవ్‌ సంస్థతో యాక్రోటెక్‌ బయోఫార్మా లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రైజ్‌న్యూటా ఔషధ అభివృద్ధి, తయారీ, రిజిస్ట్రేషన్‌, సరఫరా బాధ్యతలను ఇవైవ్‌ చూసుకోనుండగా, యాక్రోటెక్‌ తన నెట్‌వర్క్‌ ద్వారా దాని మార్కెటింగ్‌, విక్రయాలను చేపడుతుంది. దేశీ ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాకు యాక్రోటెక్‌ అనుబంధ సంస్థ. కీమోథెరపీ సైడ్‌ ఎఫెక్ట్‌ అయిన న్యూట్రోపేనియా అనారోగ్య సమస్యల చికిత్సలో రైజ్‌న్యూటాను వాడతారు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.