ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి

ఆస్ట్రేలియా ప్రభుత్వం శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి

ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. దాదాపు ఏడాది కాలంగా ఇండియన్ల రాకపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ 2021 నవంబరు 22న ప్రకటన చేశారు. డిసెంబరు 1 నుంచి స్టూడెంట్‌ వీసా, స్కిల్డ్‌ వర్క్‌ వీసా ఉన్న వారు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందే సదరు వ్యక్తలు ఆయా  దేశాల్లో రెండో డోసుల కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకుని ఉండాలి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను ప్రయాణం సందర్భంగా చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సుమారు 2,35,000 మంది విదేశీయులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. వీరిలో 1,60,000 మంది స్టూడెంట్‌ వీసా కలిగిన వారే ఉన్నారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విదేశీయులకు 21 శాతం కేటాయించడంతో  ప్రపంచ దేశాల నుంచి ఆసీస్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

 

Tags :