ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన ప్రవాస భారతీయ మహిళ శాస్త్రవేత్తలు

ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక సూపర్‌స్టార్స్ ఆఫ్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భారతీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాని ముఖర్జీ చోటు సాధించారు. శాస్త్రవేత్తల గురించి సమాజంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలకు తుడిచి పెట్టడమే కాకుండా మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి అవకాశాలను కల్పించడమే ఈ అవార్డుల లక్ష్యమని విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడిరచారు. లక్షకు పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ప్రతినిధులుగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా (ఎస్టీఏ) ఏటా ఇలా 60 మంది ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తోంది.
Tags :