MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికా నిర్ణయం... చైనాకు చెక్ పెట్టేందుకే

అమెరికా నిర్ణయం... చైనాకు చెక్ పెట్టేందుకే

ఆస్ట్రేలియాకు 220 టోమహాక్‌ దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణులను సరఫరా చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే ఆ దేశానికి అణు జలాంతర్గాములను సమకూర్చాలని ఆకస్‌ (ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా) కూటమి నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడిరది. టోమహాక్‌ క్షిపణులను సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల్లో వినియోగించే అవకాశం ఉంది. చైనాను లక్ష్యంగా చేసుకొని ఈ ఆయుధాలను అగ్రరాజ్యం సరఫరా చేస్తోంది. ఈ క్షిపణి విక్రయాలతో అమెరికా, ఇతర మిత్రదేశాల దళాలతో ఆస్ట్రేలియా సమన్వయం చేసుకొంటూ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే ఆపరేషన్లను విజయవంతంగా చేయగలదు అని అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.  ఈ ఒప్పందం విలువ 89.5 కోట్ల డాలర్లు అని తెలిపింది. 2033 నాటికి తమకు మూడు వర్జీనియా శ్రేణి జలాంతర్గాములు అందుతాయని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పాట్‌ కాన్రే తెలిపారు. అప్పటికి టోమహాక్‌ క్షిపణులూ అందుబాటులో వస్తాయన్నారు.

 

 

Tags :