డీమార్ట్ అరుదైన ఘనత ...రిలయన్స్ సరసన

డీమార్ట్ అరుదైన ఘనత ...రిలయన్స్ సరసన

డీ మార్ట్స్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ లిమిటెడ్‌ సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. డీమార్ట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ ఏకంగా 3 ట్రిలియన్‌ డాలర్లు (రూ.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17వ ఇండియన్‌ స్టాక్స్‌ లిస్టెడ్‌ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలో డీమార్ట్‌ షేర్ల విలువ 6 నెలల్లో 70 శాతం, ఏడాది కాలంలో 100 శాతానికి పైగా లాభపడిరది. బీఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్‌లో డీమార్ట్‌ షేర్‌ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.4,837 ను తాకింది. దీంతో డీ మార్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ 3.11 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి డీమార్ట్‌ షేర్‌ విలువ 7 శాతం పెరిగి ఎస్‌ఎస్‌ఈలో రూ.4716.50 నిలిచింది. బీఎస్‌ఈలో రూ.4.719.40గా ఉంది. సోమవారం ఒకే రోజు ఒక్కో షేర్‌ విలువ రూ.308కు పైగా పెరిగింది.

 

Tags :