తెలుగు సినీ పరిశ్రమకు బి ఏ రాజు లేని లోటు తీర్చలేనిది : సినీ ప్రముఖులు

తెలుగు సినీ పరిశ్రమకు బి ఏ రాజు లేని లోటు తీర్చలేనిది : సినీ ప్రముఖులు

తెలుగు సినీ పరిశ్రమ నిర్మాత, పత్రికాధినేత, స్టార్ పిఆర్ఓ బి ఏ రాజు గత ఏడాది ఆరోగ్య సమస్యల కారణంగా మనకి దూరమయ్యి సంవత్సరం అవుతోంది (మే 21). ఆయనని స్మరించుకుంటూ ప్రథమ వర్ధంతిని మే 11న ఆయన కుటుంబ సభ్యులు నేడు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ నందు జరిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన స్నేహితులు, తోటి పాత్రికేయ మిత్రులు పరిశ్రమతో ఆయనకి ఉన్న విడదీయరాని బంధాన్ని, పాత్రికేయ ప్రపంచంలో ఆయన కార్యదక్షతను, రాజు గారు అందించిన వెలకట్టలేని సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు ఎస్ వి కృష్ణా రెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి, నిర్మాత సి కళ్యాణ్ , దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , హీరో అశోక్ గల్లా, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరి రావు, నిర్మాత ఎం ఎస్ రాజు, నిర్మాత బండ్ల గణేష్ మరియు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు హాజరై బి ఏ రాజు తో తమకున్న అనుబంధం గురించి తెలియచేసారు.

బి ఏ రాజు గారి ప్రస్థానం

సంపాదకుడిగా, సినిమా ప్రచారకర్తగా, నిర్మాతగా యావత్ తెలుగు సినీ పరిశ్రమకు అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న శ్రీ బి ఏ రాజు ది దశాబ్దాల ప్రయాణం,.1982 లో సినీ పాత్రికేయుడిగా సినిమా పరిశ్రమలో రంగప్రవేశం చేసిన  శ్రీ  బి ఏ రాజు పరిశ్రమ లోని చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరితో స్నేహభావంతో ఉండేవారు. సూపర్ స్టార్ కృష్ణ వద్ద ఫ్యాన్ మెయిల్ కి ప్రత్యుత్తరాలు ఇస్తూ అగ్రస్థాయి పీఆర్ఓ గా పనిచేయడం రాజు గారికి ఒక్కరికే సాధ్యం అయిన ఘనత. అయన మరణించేనాటికి 1600 చిత్రాలకు పైగా ఆయన ప్రచారకర్త గా పనిచేశారు. పాత తరం వారికి బి ఏ రాజు, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానిగా, అత్యంత ఆత్మీయునిగా చిరపరిచితం. తర్వాతి రోజుల్లో ఆయన జర్నలిస్ట్ గా వృత్తి పట్ల నిబద్ధతతో అంచలంచెలుగా ఎదిగి పరిశ్రమలో టాప్ స్టార్స్ కి తన వ్యక్తిత్వం తో సన్నిహితులు అయ్యారు. ఆయనకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో ఉన్న అనుబంధం మూడు దశాబ్దాలకు పైనే. ఆయన సూచనలు, అభిప్రాయాలకు పెద్ద హీరోలు, దర్శక నిర్మాతలు సైతం ఎంతో విలువ ఇచ్చేవారు. సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ రాజు గారితో తనకి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన లేని లోటు తీర్చలేనిది అన్నారు. ఈ సందర్భంగా సామజిక వేత్త, నటుడు సోనూ సూద్ బి ఏ రాజు తో తనకున్న అనుబంధం పై వీడియో బైట్ పంపించారు. కార్యక్రమం లో బి ఏ రాజు సినీ ప్రస్థానం పై  ప్రదర్శించిన స్లయిడ్ షో ఆకట్టుకుంది.   

 

 

Tags :