మహిళలకు రాందేబ్ బాబా క్షమాపణ

మహిళలకు రాందేబ్ బాబా క్షమాపణ

దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్‌ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణ చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలు మహిళలకు బాధించి ఉంటే క్షమించాలని కోరారు. రాందేవ్‌ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం తీవ్రంగా మండిపడిరది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. మహిళా సంఘాలతో పాటు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సణ్‌ రూపాలీ చకాంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

 

Tags :