MKOne Telugu Times Youtube Channel

2050 నాటికి 80 కోట్ల మందికి

2050 నాటికి 80 కోట్ల మందికి

జనాభాలో వృద్ధులు పెరగనున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2050 నాటికి 84 కోట్ల మంది ప్రజలు వెన్నునొప్పితో బాధపడతారని ఓ పరిశోధన వెల్లడించింది.  ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ సంఖ్యలో ఈ కేసులు నమోదవుతాయని పేర్కొంది. 2017 నుంచి వెన్ను లేదా నడుము నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య 50 కోట్లు ఉండగా 2020 నాటికి అది 60 కోట్లకు చేరింది. ఉద్యోగ పరిసరాలు, ధూమపానం, ఊబకాయం వెన్నునొప్పికి ప్రధాన కారణాలు. వృద్ధుల్లో అయితే ఇది ఒక సాధారణ సమస్యలా మారిపోయింది. 1990 నుంచి 2020 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ పోకడను అంచనా వేశాం. సరైన వ్యాయామంతో పాటు వెన్నునొప్పికి సంబంధించిన అవగాహన కూడా అవసరం. అలాగే చాలా దేశాల్లో అశాస్త్రీయ వైద్య విధానాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని పరిశోధన పత్రం పేర్కొంది. పెరుగుతున్న వెన్నునొప్పి కేసుల వల్ల వైద్య రంగంపై ఎక్కడ లేని భారం పడుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశాల స్థాయిలో ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు వైద్యులు అనుసరిస్తున్న మార్గదర్శకాలు,  చికిత్సా విధానాలు భవిష్యత్తులో అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు పేర్కొన్నారు. 

 

 

Tags :