MKOne TeluguTimes-Youtube-Channel

టర్కిష్ సూఫీ సంగీత  ప్రదర్శన ఫిబ్రవరి 3న శిల్ప కళా వేదికలో

టర్కిష్ సూఫీ సంగీత  ప్రదర్శన ఫిబ్రవరి 3న శిల్ప కళా వేదికలో

టర్కీ రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా ల అధ్వర్యంలో నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు. సేమ పేరుతో శిల్ప కళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ప్రముఖ కొన్య టర్కిష్ సూఫీ సంగీత బృందం ఇక్కడ ప్రదర్శన ఇవ్వనుంది. 

ఈ సందర్భంగా టర్కీ కాన్సల్ జనరల్ ఓర్హన్ యల్మన్ ఒకన్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు బిన్నం అయినప్పటికీ సంస్కృతులు ఒక్క్యే అన్నారు. టర్కీలో ప్రముఖమైన సూఫీ సంగీతాన్ని నగర వాసులకు అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం అన్నారు. టర్కీ, హైదారాబాద్ లు గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగి ఉన్నాయన్నారు. సూఫీ సంగీతాన్ని నగర వాసులు ఎంతగానో ఆనందిస్తారని అన్నారు. సూఫీ సంగీతంలో భాగంగా నెయ్, కుడుం, తంబుర, తెఫ్ తదితర వాయిద్యాలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారని అన్నారు. 

బజాజ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ కరణ్ బజాజ్ మాట్లాడుతూ.. "టైమ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్ " విర్లింగ్ డెర్విషెస్‌తో అనుబంధించడం చాలా గొప్పగా అనిపిస్తుందన్నారు.. ఈ వేదిక సంగీతం, సంస్కృతులలో ఇరు దేశాల ప్రజలను ఏకం చేస్తుందనీ అన్నారు. 

ట్రైడెంట్ సంస్థ  జనరల్ మేనేజర్ధీరజ్ మెహతా మాట్లాడుతూ.. ట్రైడెంట్, హైదరాబాద్ టర్కిష్ కాన్సులేట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఆఫ్ హైదరాబాద్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

 

 

Tags :