న్యూజెర్సిలో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

న్యూజెర్సిలో ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

న్యూజెర్సిలో నాట్స్ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‍ నాయకులు మోహన్‍ క•ష్ణ మన్నవ అధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. జూమ్‍ కాల్‍ ద్వారా బాలయ్య అభిమానులతో మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నారు.  తన సినిమాలకి మరియు బసవతారకం క్యాన్సర్‍ ఇన్స్టిట్యూట్‍కి అమెరికాలోని అభిమానులు అందించిన సహాయ సహకారాలకి ఎప్పుడు మరవలేనని చెప్పారు. అభిమానులు తన ప్రాణ సమణులు అని వాళ్ళ కోసం తాను చివర వరకు నటిస్తూనే ఉంటానని వెల్లడించారు. మోహన్‍ క•ష్ణ మన్నవ మాట్లాడుతూ హిందూపూర్‍ ఎమ్మెల్యేగా, ఇటు బసవతారకం కాన్సర్‍ హాస్పిటల్‍ చైర్మన్‍గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రతి పేదవాడికి బాసటగా నిలిచారు అని కొనియాడారు.  పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కేక్‍ కట్‍ చేశారు. బాలయ్య నటించిన సినిమాల్లోని డైలాగులు, పాటలు అభిమానుల్ని ఆహ్లాదపరిచాయి. శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, రమేష్‍ నూతలపాటి, మోహన్‍ కుమార్‍ వెన్నిగళ్ల, రాధా క•ష్ణ నల్లమల, 

ప్రతాప్‍ చింతపల్లి, శ్రీనివాస్‍ ఓరుగంటి, శ్రీ చౌదరి, రంజిత్‍ చాగంటి, రామక•ష్ణ వాసిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags :