‘అన్‌స్టాపబుల్’ కు బాలయ్య ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు?

‘అన్‌స్టాపబుల్’ కు బాలయ్య ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు?

నందమూరి బాలకృష్ణ  ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ షో రెమ్యూనరేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి మొదటి సీజన్ గడిచేందుకు వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ వెండితెరపై ఎలా విజృంభిస్తాడో అందరికీ తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ మీద బాలయ్యకు ఎదురులేదని అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలు, టాక్ షోలు బాలయ్యకు సరిపోవని కామెంట్లు వినిపించేవి. కానీ బాలయ్య ఇప్పుడు వాటన్నంటికి సమాధానం చెప్పేశాడు. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య నిజంగానే అన్ స్టాపబుల్, ఆయన్ను ఎవ్వరూ ఆపలేరు అని నిరూపించేశాడు. బాలయ్య హోస్ట్ చేసిన ఈ అన్ స్టాపబుల్ షో టాప్ రేటింగ్‌తో దూసుకుపోయింది. టాక్ షోలకే బాప్ షో అని చెప్పిన మాటలను నిలబెట్టేసుకున్నారు. ఇక మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్‌కి కూడా రెడీ అవుతున్నారు. ఇలానే గతంలోనూ సమంత సామ్ జామ్ షోను నడిపించారు. అది క్లిక్ అవ్వకపోవడంతో రెండో సీజన్ జోలికి వెళ్లలేదు. కానీ ఇక్కడ బాలయ్య సక్సెస్ అయ్యాడు.

అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. బాలయ్య హోస్ట్ చేసే విధానం, మాటతీరు, అందరితో కలుపుగోలుగా ఉండే పద్దతి ఇలా అన్ని కలిపి షోను క్లిక్ చేశాయి. అయితే ఇప్పుడు బాలయ్య సెకండ్ సీజన్‌కు కూడా రెడీ అవుతున్నాడట. కాకపోతే ఈ సారి మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్. మొదటి సీజన్‌లో అయితే ఒక్కో ఎపిసోడ్‌కు మొత్తం కలిసి..  నలభై లక్షల వరకు తీసుకున్నాడని వినికిడి,  మొదటి సీజన్‌లో ఐదు కోట్ల వరకు ఖాతాలో పడ్డాయని సమాచారం. ఇక రెండో సీజన్‌కు బాలయ్య ఎంత చార్జ్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. మంచు వారితో మొదలెట్టిన ఈ మొదటి సీజన్.. మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఫిబ్రవరి 4న ముగియనుంది.

 

Tags :