'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' సీజ‌న్ 2 కి సిద్ధమైన బాలయ్య

'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' సీజ‌న్ 2 కి  సిద్ధమైన బాలయ్య

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 1 ముగింపు స‌మ‌యంలో అప్పుడే సీజ‌న్ అయిపోయిందా! అని భావించారు. కానీ అన్‌స్టాప‌బుల్‌తో భ‌విష్య‌త్తులో కొన‌సాగుతాన‌ని బాలకృష్ణ చెప్ప‌క‌నే చెప్పేశారు. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2కి ఆహా యాజ‌మాన్యం స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఈసారి సీజ‌న్‌లో గెస్టులుగా ఎవ‌రెవ‌రినీ పిల‌వాలి.. ప్రోగ్రామ్ ఎలా ఉండాల‌నే దానిపై గ‌ట్టిగానే క‌స‌రత్తులు చేస్తున్నార‌ట.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుందట.. అదెప్పుడంటే..ఒక వైపు సినిమాలు.. మ‌రో వైపు రాజ‌కీయాలంటూ ఫుల్ బిజీగా ఉండే నంద‌మూరి అంద‌గాడు.. అగ్ర క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ  గ‌త ఏడాది అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తూ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. బాల‌కృష్ణ‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేసి ఆయ‌న ఇమేజ్‌ను డ‌బుల్ చేసిన ప్రోగ్రామ్ ఏదైనా ఉందా! అంటే అన్‌స్టాప‌బుల్  అని ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు.

తెలుగు డిజిటిల్ మాధ్య‌మ‌మైన ఆహా అస‌లు బాల‌కృష్ణ‌ను హోస్ట్‌గా చేయాల‌నే ఆలోచ‌న ఎలా ఉంటుందా? అని అనౌన్స్ చేసిన స‌మయంలో చాలా మంది భావించారు. కానీ బాల‌కృష్ణ త‌న స్ట‌యిల్‌కు భిన్నంగా అన్‌స్టాప‌బుల్‌తో ఆక‌ట్టుకున్నారు. సాధార‌ణంగా దూకుడుగా ఉండే బాల‌కృష్ణ త‌న పంథాను మార్చి చాలా కూల్‌గా డిఫ‌రెంట్‌గా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నారు. బాల‌య్య స్టైల్‌, ఆయ‌న ప్రోగ్రామ్‌ను ర‌న్ చేసిన తీరు చూసిన యాంటీ ఫ్యాన్స్ కూడా ఆయ‌న్ని ప్ర‌శంసించారంటే ప్రోగ్రామ్ ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవ‌చ్చు.రెగ్య‌ల‌ర్‌గా ఉండే టాక్ షోకు భిన్నంగా అన్‌స్టాప‌బుల్ సాగింది. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌తో బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌ర‌దాగా వారితో గ‌డిపిన స‌మ‌యం.. వారిని వేసిన ప్ర‌శ్న‌లు.. వారు వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌నిచ్చిన స‌మాధానాలు అంద‌రినీ అల‌రించాయి. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శల‌కు బాల‌కృష్ణ ఈ టాక్‌షోతో చెప్ప‌క‌నే స‌మాధానం చెప్పేశారు. దీంతో ఈ షో ఎంత స‌క్సెస్ అయ్యిందంటే దేశంలోని అన్ని టాక్‌షోల‌పై IMDB వారు ప్ర‌క‌టించిన రేటింగ్‌లో 9.7 సాధించి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే  సీజ‌న్ 1 ముగింపు స‌మ‌యంలో అప్పుడే సీజ‌న్ అయిపోయిందా! అని భావించారు. కానీ అన్‌స్టాప‌బుల్‌తో భ‌విష్య‌త్తులో కొన‌సాగుతాన‌ని బాలకృష్ణ చెప్ప‌క‌నే చెప్పేశారు. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే  సీజన్ 2కి ఆహా యాజ‌మాన్యం స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఈసారి సీజ‌న్‌లో గెస్టులుగా ఎవ‌రెవ‌రినీ పిల‌వాలి.. ప్రోగ్రామ్ ఎలా ఉండాల‌నే దానిపై గ‌ట్టిగానే క‌స‌రత్తులు చేస్తున్నార‌ట టీమ్‌. ఆగ‌స్ట్ 15న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే  సీజన్ 2కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవుతుంద‌ని అందులో సీజ‌న్ 2 ఎప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుంద‌నే అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రించే అవ‌కాశం ఉందంటున్నారు.

AHA TWEET LINK:

https://twitter.com/ahavideoIN/status/1538740928667598848

 

Tags :