బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అరుదైన స్థానం

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అరుదైన స్థానం

బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితికి ప్రపంచ రికార్డులో స్థానం కల్పించామని భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు కేవీ రమణారావు తెలిపారు. ఈ సంవత్సరం బాలాపూర్‌ లడ్డూ రూ.18.90 లక్షలకు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, తన మిత్రుడు మర్రి శశాంక్‌ రెడ్డితో కలిసి దక్కించుకున్నారని తెలిపారు. 28 సంవత్సరాలుగా మహాగణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చే ఆదాయాన్ని పలు దేవాలయాల అభివృద్ధికి బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు కృషి చేస్తున్నారని అన్నారు. దీంతో బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితికి యూనివర్సల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు తెలిపారు. రికార్డ్స్‌ ధ్రువపత్రాలను బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు కళ్లెం నిరంజన్‌ రెడ్డి, ఎస్‌.శ్రీనివాస్‌ రెడ్డికి అందజేశామన్నారు.

 

Tags :