అలయ్ బలయ్ కు రండి.. జనసేన అధినేతకు ఆహ్వానం

అలయ్ బలయ్ కు రండి.. జనసేన అధినేతకు ఆహ్వానం

ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి వపన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ క్యాక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. గడిచిన 16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా విజయలక్ష్మీ పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు.

 

Tags :