బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం.. వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే

ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం ధర్మం వైపు నిలబడిన ఉపాధ్యాయులు, అధ్యాపకులదిగా పేర్కొన్నారు. టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి ఉపాధ్యాయుల సమస్యలకు చొరవచూపాలని కోరారు. నియంతృత్వ పోకడలకు పోతున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. వచ్చే సాధారణ ఎన్కికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారన్నారు.
Tags :