రాష్ట్రపతి ఎన్నికలను సీఎం కేసీఆర్.. గల్లీస్థాయికి

రాష్ట్రపతి ఎన్నికలను సీఎం కేసీఆర్.. గల్లీస్థాయికి

రాష్ట్రపతి ఎన్నికలను సీఎం కేసీఆర్‌ గల్లీస్థాయికి దిగజార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్వవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించడం లేదన్నారు. కేసీఆర్‌  బీజేపీ ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన తమను అడ్డుకోలేరని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భయపడే తమపార్టీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. డబ్బుతో ప్రలోభపెట్టి, కేసులతో భయపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించారు.

 

Tags :