అమరావతి రైతులకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మద్దతు!

అమరావతి రైతులకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మద్దతు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మద్దతు తెలపాలనుకుంటున్నట్లు సమాచారం. రాజధాని విషయంలో బీజేపీ విధానం స్పష్టమైన నేపథ్యంలో ఆయన రైతులను కలవాలని అనుకుంటున్నారు. ఈ విషయంపై పార్టీ నేతల కొందరితో సంజయ్‌ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లి అమరావతి రైతుల్ని కలిసి సంఫీుభావం తెలపాలనుకుంటున్నట్ల బండి సంజయ్‌ పార్టీ నేలతో చెప్పినట్లు తెలిసింది.

 

Tags :