గిరిజనులంటే కేసీఆర్‌కు చులకన.. అందుకే పట్టించుకోరు: బండి సంజయ్

గిరిజనులంటే కేసీఆర్‌కు చులకన.. అందుకే పట్టించుకోరు: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గిరిజనులు అంటే చులకన భావం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేయాలని బీజేపీ అనుకుంటే, దాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా గిరిజన జాతర జరుగుతోంది. దీనికి కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూ జాతరలు అంటేనే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అదే సమయంలో నిజాం వారసుల మృతదేహాలకు స్వాగతం పడుతున్నారని విమర్శించారు. సెలబ్రిటీలు ఎవరైనా మరణిస్తే కేసీఆర్ హడావుడిగా వెళతారు కానీ, గిరిజన ప్రాంతాల వైపు కనీసం చూడను కూడా చూడటం లేదని తెలియజేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తూనే ఉన్నా.. ఇప్పటికి ఆ హామీ నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే హిందూ జాతరలు వైభవంగా నిర్వహిస్తామని బండి సంజయ్ మాటిచ్చారు.

 

 

Tags :