టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో .. కీలక పరిణామం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో .. కీలక పరిణామం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. బీజేపీ నేత బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్‌ చేశారని శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. అక్టోబర్‌ 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సింహయాజీకి శ్రీనివాస్‌ విమాన టికెట్లు బుక్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. సింహయాజీతో శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీసుకున్నారు. అయితే సిట్‌ విచారణకు తుషార్‌, బీఎల్‌ సంతోష్‌, జగ్గు స్వామి గైర్హాజరయ్యారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.