అందుకే వామపక్ష, ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ

అందుకే వామపక్ష, ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ యువ  మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బండి సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చర్యలకు సిద్దమైందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపితే సానుభూతి పొందాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, అందుకే వామపక్ష, ఇతర విపక్ష నేతలతో ఆయన భేటీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్ని డ్రామాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వదలిపెట్టదని అన్నారు.

 

Tags :