తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  బండి మాట్లాడుతూ సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారని, బీజేపీని అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైందన్నారు. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచచి బయటకు పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి పోకడలతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 17 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుంది అని అన్నారు. బీజేపీ పాదయాత్రతో టీఆర్‌ఎస్‌ పతనం మొదలైందని అన్నారు.

 

Tags :