317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాటం : బండి సంజయ్

317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాటం : బండి సంజయ్

317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో 317 జీవోకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కూటములు కట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. కేసీఆర్‌, కటుంబం అవినీతిపై విచారణలు జరుగుతాయని  పేర్కొన్నారు. విచారణల భయం వల్లే జాతీయ కూటమి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గవద్దని ప్రధాని మోదీ ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. కొవిడ్‌ కంటే అతి ప్రమాదకరమైన వైరస్‌ కేసీఆర్‌ అని ఆరోపించారు.

 

Tags :