ఐటీ దాడులు కొత్త కాదు.... అది తెలీయకపోవడం విడ్డూరం : బండి సంజయ్

ఐటీ దాడులు కొత్త కాదు.... అది తెలీయకపోవడం విడ్డూరం : బండి సంజయ్

ప్రజలను దోచుకొని అడ్డంగా ఆస్తులు సంపాదిస్తే సోదాలు చేస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదులు వస్తే ఆధారాతో వాటిపై స్పందించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ, అధికారులపై ఉంటుందని తెలిపారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. ఆక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.