విద్యార్థుల సమ్యలను తక్షణమే పరిష్కరించాలి : బండి సంజయ్

విద్యార్థుల సమ్యలను తక్షణమే పరిష్కరించాలి : బండి సంజయ్

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆయన లేఖ రాశారు. ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా సీఎంకు పట్టదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుందా? విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలి అని అన్నారు.

 

Tags :