ఆ కుటుంబానికి భయపడే.. విమోచన దినోత్సవం చేయడం లేదు

ఆ కుటుంబానికి భయపడే.. విమోచన దినోత్సవం చేయడం లేదు

నిజాం కుటుంబానికి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17న తెలంగాన విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారని అన్నారు.  ఓల్డ్‌ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఎప్పటికీ వెళ్ళరని చెప్పారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లు గుర్తు కొస్తాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

 

Tags :