సెప్టెంబర్ 17ను నిర్వహించేలా చేస్తాం: బండి సంజయ్

సెప్టెంబర్ 17ను నిర్వహించేలా చేస్తాం: బండి సంజయ్

తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచైనా సెప్టెంబర్‍ 17ను నిర్వహించేలా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‍ఎస్‍, ఎంఐఎం పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‍ఎస్‍ ఓ తుగ్లక్‍ పార్టీ, ఎంఐఎం ఓ తాలిబన్‍ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‍కు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. హుజురాబాద్‍ ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపించారు. కేంద్రం రూ. లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‍ఎస్‍ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 

Tags :