అన్ని వర్గాలకు మోదీ ప్రభుత్వం సముచిత న్యాయం : బండి సంజయ్

అన్ని వర్గాలకు మోదీ ప్రభుత్వం సముచిత న్యాయం : బండి సంజయ్

ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అవుతారని ఎవరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద థింసా నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ద్రౌపదీ ముర్మూ తల్లిగా భారతదేశానికి సేవ చేస్తారనే నమ్మకం ఉందన్నారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మోదీ ప్రభుత్వం సముచిత న్యాయం చేస్తుందని తెలిపారు. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్‌ షాకు తెలంగాణ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జులై 3న జరిగే బహిరంగ సభకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, మోదీకి అండగా నిలవాలని కోరారు.

 

Tags :