బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ సహా ఎవరినీ వదిలిపెట్టం

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ సహా ఎవరినీ వదిలిపెట్టం

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ పై తెలంగాణ రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో సంజమ్‌ మాట్లాడుతూ లిక్కర్‌, డ్రగ్స్‌, పేకాట దందా చేసేటోళ్ల అంతు చూస్తాం. కేసీఆర్‌ కుటంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీఆర్‌ఎస్‌ నేతలు డ్రగ్స్‌  దందా చేస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో ఐదుగురు టీఆర్‌స్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.  బెంగళూరు పోలీసులను మేనేజ్‌ చేసి కేసును మూసివేయించారు. ఆ కేసును మళ్లీ బయటకు తీస్తాం. కేసీఆర్‌ సహా ఎవరినీ వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న పాత్ర కేసులన్నీ తిరగదోడాల్సిందే. హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రేమయం ఉందని ఆరోపణలు చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

 

Tags :