ప్రధాని మోదీ కోసం.. మృత్యుంజయ హోమాలు

ప్రధాని మోదీ కోసం.. మృత్యుంజయ హోమాలు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మృత్యుంజయ హోమాన్ని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించారు. జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల కార్యకర్తలు. హైదరాబాద్‌లో అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్వహించిన మృత్యుంజయ హోమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ ను నిరసనకారులు అడ్డుకున్న దాని వెనుక మహా కుట్ర ఉందని ఆరోపించారు. ఇది అనుకోకుండా జరిగింది కానేకాదని తెలిపారు. ఎందుకంటే ప్రధాన పర్యటన వివరాలు, గైడ్‌ లైన్సును డిసెంబర్‌ 30 నాడే  స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు పంజాబ్‌ డీజీపీకి  పంపించారు. ప్రధాని పర్యటన రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ నివేదించింది. అరోజు వాతావరణం అనుకూలంగా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా ఫిరోజ్‌పూర్‌ వెళాతరని, తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఎస్పీజీ నుంచి ప్లాన్‌ బీ సమచారాన్ని కూడా పంపింది. కానీ పంజాబ్‌ సీఎం, డీజీపీలు తమకు సమాచారం లేకుండా ప్రధాని అప్పటికప్పుడు రోడ్డు ప్రయాణం పెట్టుకున్నారని చెప్పడం పచ్చి అబద్ధమని ఆరోపించారు. వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

 

Tags :