ఆ చెక్కులు బౌన్స్ అవడంతో... కేసీఆర్ను చూసి దేశమంతా

పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సీఎం కేసీఆర్ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా నందన్ గ్రామంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్, క్యాసినో, దండాల్లో కేసీఆర్ బిడ్డ వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇక్కడున్నవి బెల్ట్ షాపులు కాదని, అవి కేసీఆర్ షాపులని ఆరోపించారు. ముఖ్యమంత్రి 100 రూములతో ఇల్లు కట్టుకున్నారని, 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తు కోట్లు గడిస్తున్నారని అన్నారు. రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకు ధరణి తెచ్చారని విమర్శించారు. తెలంగాణ రైతులను పట్టించులోని కేసీఆర్ పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని, చివరికి ఆ చెక్కులు బౌన్స్ అవడంతో తెలంగాణ ఇజ్జత్ పోయిందన్నారు. పేదోళ్ల సమస్యలు భాధలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే పాదయాత్ర చేస్తున్నానని అన్నారు.