బీజేపీకి అవకాశం ఇస్తేనే.. అదే జరుగుతుంది

బీజేపీకి అవకాశం ఇస్తేనే..  అదే జరుగుతుంది

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే భావనలో ప్రజలు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.  ప్రజలకు విశ్వాసం కల్పించి వారి పక్షాన పోరాడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.

 

Tags :