రివ్యూ : సంక్రాంతి పండగ సినిమాల్లో బంగర్'రాజు'

రివ్యూ : సంక్రాంతి పండగ సినిమాల్లో బంగర్'రాజు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5

నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, సంపత్‌ రాజ్‌, గోవింద్‌ పద్మసూర్య తదితరులు

సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్‌, ఎడిటర్‌ : విజయ్‌ వర్థన్

నిర్మాత : అక్కినేని నాగార్జున, దర్శకత్వం : కల్యాణ్‌ కృష్ణ కురసాల

విడుదల తేది : 14.01.2022

బంగార్రాజు పాత్రతో అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రం 2016 సంక్రాంతి పండగ సీజన్‌లో విడుదలై సూపర్‌ హిట్టైంది. ఏకంగా కింగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఈ రోజు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం..మళ్ళీ పంచెకట్టు, పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌ చేయడంలో ‘బంగార్రాజు’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? రివ్యూలో చూద్దాం.

కథ:

బంగార్రాజు కథ గురించి చెప్పాల్సివస్తే... సోగ్గాడే చిన్నినాయనా లో ఎక్కడైతే ముగుస్తుందో ఈ కథ అక్కడ నుంచి మొదలవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. బంగార్రాజు(నాగార్జున) స్వర్గానికి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. కొన్నాళ్లకు డాక్టర్‌ రాము (నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యలను నాన్నమ్మ సత్య అలియాస్‌ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్నబంగార్రాజు (నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ.. అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. మరి ఇదిలా ఉండగా కొన్నాళ్ళకి తన భార్య సత్యమ్మ(రమ్య కృష్ణ) కూడా చనిపోయి బంగార్రాజు దగ్గరకే వెళ్తుంది. అక్కడ తమకి ఒక మనవడు చిన బంగార్రాజు ఉన్నాడని చిన బంగార్రాజుకి కూడా తాత పోలికలే వచ్చి కొంటెగా లైఫ్ ని సాగిస్తున్నాడని జీవితంపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు నువ్వెళ్ళి మార్చమని సత్యమ్మ బంగార్రాజుకి చెబుతుంది. మరి ఈసారి అక్కడ నుంచి వచ్చిన బంగార్రాజు తన మనవడి కోసం ఏం చేసాడు? చిన బంగార్రాజుకి కూడా ఏవైనా ప్రాణాంతక ముప్పు ఉందా? ఉంటే వాటిని బంగార్రాజు ఎలా సాల్వ్ చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

కింగ్ నాగార్జున విషయానికి వస్తే ఈసారి తన స్కోప్ అంతా చైతూకి ఇచ్చి వెనకుండి నడిపించే పాత్రలా మంచి నటన కనబరిచారు. బంగార్రాజు గా మళ్ళీ అదే మ్యాజిక్ తో మరింత ఉత్సాహాన్ని ఈ సినిమాలో అందించారని చెప్పాలి. ముఖ్యంగా చైతూ తో కలిపి ఉండే సన్నివేశాలు అయితే ఆడియెన్స్ కి మంచి ట్రీట్ లా కన్నుల పండువగా అనిపిస్తాయి. అంతే కాకుండా నాగ్ ఛార్మింగ్ లుక్స్ తన పాత్ర నుంచి మరో బిగ్ ఎసెట్. చిన్న బంగార్రాజు నాగ చైతన్య ది ఇంపార్టెంట్ రోల్ అతను ఇంతవరకు ఇలాంటి ఒక కొంటె పాత్రలో చూసి ఉండం దానిని చైతు సూపర్బ్ గా చేసాడని చెప్పాలి. తమ ఫామిలీ కి ఉన్న ఒక రొమాంటిక్ మార్క్ ని బంగార్రాజు తో చైతు తీసుకున్నాడని చెప్పడం లో డౌట్ లేదు. పలు కామెడీ సీన్స్ మంచి రొమాంటిక్ సీన్స్ సహా ఎమోషనల్ సన్నివేశాల్లో చైతు సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చి సినిమాలో హైలైట్ గా నిలిచాడు. అలాగే తన లుక్స్ కానీ సరికొత్త బాడీ లాంగ్వేజ్ కానీ తన నుంచి ప్రతిదీ ఆడియెన్స్ ని మంచి ఫీస్ట్ ఇచ్చేలా అనిపిస్తాయి.యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో మరో సరికొత్త పాత్రలో కనిపించి అలరిస్తుంది. ఉప్పెన తర్వాత మరోసారి పల్లెటూరి అమ్మాయిలా ఈసారి మరింత ఎనర్జిటిక్ రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరింత అందంగా ఫన్నీ యాంగిల్ లో కూడా కనిపించి మెప్పిస్తుంది. ఇక స్పెషల్ సాంగ్ లో కనిపించిన 'జాతిరత్నాలు ' ఫరియా సినిమాలో హ్యాపీ మూడ్ కి మరింత జోష్ ని తీసుకొచ్చేలా చేసింది. అలానే వెన్నెల కిషోర్, రావు రమేష్ మరియు రమ్య కృష్ణ లు తమ రోల్ పరిధి మేరకు మంచి నటనను కనపర్చారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఇక సాంకెతిక పరంగా చూస్తే... దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విషయానికి వస్తే ఈసారి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు చెప్పాలి. ముఖ్యంగా సీక్వెల్ ని తాను ప్లాన్ చేసిన విధానం మెప్పించే విధంగా ఉంది. అలానే దానిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకునే రీతిలో ఉండడం ఈ సినిమా విజయంలో ముఖ్య భాగం. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ ని ఇంకా బాగా మలచి ఉంటే బాగుండేది. మరికొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించినట్టు అయితే సినిమా అవుట్ మరింత మెరుగ్గా వచ్చి ఉండేది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకి ప్లస్‌. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. అయితే సినిమాల్లో వచ్చే పాటలు.. కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్‌ వర్థన్‌ తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి.

విశ్లేషణ:

సోగ్గాడే.. సినిమా మాదిరినే.. ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. అందులో కొడుకు,కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్‌లో సత్తెమ్మ ఆత్మ అదనం. అయితే సోగ్గాడే.. ఆకట్టుకున్నంతగా.. బంగార్రాజు ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌ సీన్లతో నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ.. సాదాసీదాగానే సాగిపోతుంది. సర్పంచ్‌ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదనే చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే ఈ “బంగార్రాజు” ఈ పండుగకి ఆకట్టుకుంటాడని చెప్పాలి.

 

Tags :
ii). Please add in the header part of the home page.