సంక్రాంతి పండగలా 'బంగార్రాజు' ట్రైలర్

సంక్రాంతి పండగలా 'బంగార్రాజు' ట్రైలర్

అక్కినేని నాగార్జున, తండ్రీకొడుకులు అక్కినేని  నాగచైతన్య కాంబోలో వస్తోన్న మూవీ బంగార్రాజు. ఈ నెల 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ తాజాగా బంగార్రాజు ట్రైలర్‌ రిలీజ్ చేసింది. విడుదల చేసింది. అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉన్నట్లుంది ఈ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో  ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.  ట్రైలర్‌‌లో నాగార్జున, నాగచైతన్య ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్యలు మాట్లాడే యాస, మ్యానరిజం అదిరిపోయాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సీన్స్‌తో పండగ శోభను  ముందే తీసుకొచ్చింది బంగార్రాజు ట్రైలర్‌.  బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు అనే డైలాగ్‌తో స్టార్ట్‌ అయ్యే ట్రైలర్‌‌లో.. మొదట నాగార్జున రొమాంటిక్‌ సీన్స్ అదిరిపోయాయి.

ట్రైలర్ చివరలో కృతిశెట్టి  మామిడి తోటకు వెళ్లి మాట్లాడుకుందామా అని నాగ చైతన్యతో చెప్పే డైలాగ్‌కు చైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ ఇచ్చే రియాక్షన్ అదుర్స్. కల్యాణ్‌కృష్ణ కురసాల డైరెక్షన్‌లో తెరకెక్కింది ఈ మూవీ. ఇక కృతిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్స్. బంగార్రాజు మూవీని జీ స్టూడియోస్‌తో  కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీలో ఏకంగా 8మంది హీరోయిన్లు సందడి చేయనున్నారని టాక్. రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్‌ లీడ్స్‌ లో నటించారు. ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్‌లో తళుక్కమంది. వీళ్లతో పాటు దక్ష నాగార్కర్‌, మీనాక్షి దీక్షిత్‌, వేదిక, దర్శన బానిక్‌, సిమ్రత్‌కౌర్‌ వంటి హీరోయిన్లు కూడా బంగార్రాజు మూవీలో కనిపించనున్నారు. 

 

Tags :