ఘనంగా బాటా సంక్రాంతి సంబరాలు

ఘనంగా బాటా సంక్రాంతి సంబరాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా జరిపారు. జనవరి 22వ తేదీన వర్చువల్‌గా జరిగిన ఈ వేడుకలను ఎంతోమంది చూశారు. ఈ వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీలు, పాటల పల్లకి పేరుతో సంగీత విభావరిని నిర్వహించారు. శాస్త్రీయ నృత్యరూపకం, జానపద నృత్యాలు, హరిదాసు, గంగిరెడ్లు, బాటావారి ఆటా`పాటా, పాఠశాల ప్రత్యేక కార్యక్రమం పిల్లలతో సంక్రాంతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. రామాయణ బ్యాలెట్‌తో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. డైరెక్టర్‌ సింధుకంది ఆధ్వర్యంలో శివనూపురం కూచిపూడి నృత్య కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించారు.

పాఠశాల విద్యార్థులు నాటికలను, చిన్న కథలతో ఆకట్టుకున్నారు. బే ఏరియాలోని తెలుగు పిల్లలకు పాఠశాల ద్వారా తానా-బాటా తెలుగు భాషను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా నుంచి జానపద కళాకారులు హరిదాసు, గంగరెడ్ల విన్యాసం, కోలాటం, డప్పుల కార్యక్రమాన్ని ప్రదర్శించారు. బాటా యూత్‌ సభ్యులు తమ పాటలతో అందరినీ మైమరపింపజేశారు. బాటా వారి ఆటా పాటా అందరికీ నచ్చేలా సాగింది. ఈ కార్యక్రమానికి రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య ముఖ్య పోషకదారునిగా వ్యవహరిస్తే  అసోసియేట్‌ స్పాన్సర్‌గా సంజయ్‌ ట్యాక్స్‌ ప్రో వ్యవహరించారు. ప్లాటినం స్పాన్సర్లుగా శ్రీనివాస్‌ గోలి రియల్‌ ఎస్టేట్‌, అపెక్స్‌ కన్సల్టింగ్‌, పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌ ఉన్నారు. ఆజాద్‌ ఫైనాన్షియల్స్‌, రైట్‌కేర్‌ (హోమ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఇన్‌ తెలుగు స్టేట్స్‌) ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించారు. 

హరినాథ్‌ చికోటి (ప్రెసిడెంట్‌) మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా బాటా ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ను పరిచయం చేశారు. కొండల్‌ కొమరగిరి( వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ ముక్క, శివ కద, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేశ్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి, కల్చరల్‌ డైరెక్టర్లుగా శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు, సంకేత్‌, సందీప్‌, యూత్‌ కమిటీ సభ్యులు ఆదిత్య హరీష్‌, ఉదయ్‌ క్రాంతి ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు. బాటా అడ్వయిజరీ కమిటీ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేశ్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు బాటా టీమ్‌ను అభినందించారు. తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Click here for Photogallery

 

Tags :