ఆ చట్టం ఎట్లా వచ్చింది?... దానిపై చర్చ జరగాలి

ఆ చట్టం ఎట్లా వచ్చింది?... దానిపై చర్చ జరగాలి

రాజకీయ లబ్ధి కోసమే టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ భూక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంపై తెలంగాణ వజ్రోత్సవాల్లో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. దున్నేవాడికి భూమి కావాలన్న పోరాటం నుంచి భూమి హక్కు చట్టం ఎట్లా వచ్చింది? అన్న దానిపై చర్చ జరగాలని సూచించారు. ఆనాడు కాంగ్రెస్‌ నేతలు సత్యాగ్రహంతో పాటు పలు ఉద్యమాలు జరిపి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించారని చెప్పారు. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకొని మెరుగైన సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు.

 

Tags :