పాటలు, ఫ్యాషన్‌షో, దీపోత్సవం, నృత్యాలలో కనువిందు చేసిన ‘బాటా’ దీపావళి వేడుకలు

పాటలు, ఫ్యాషన్‌షో, దీపోత్సవం, నృత్యాలలో కనువిందు చేసిన ‘బాటా’ దీపావళి వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాటా ఎంతో వేడుకగా నిర్వహించే ఈ దీపావళి వేడుకలు ఈసారి బే ఏరియావాసులను వివిధ కార్యక్రమాలతో అలరించింది. శాన్‌రామన్‌లోని బెల్లావిస్తా ఎలిమెంటరీ స్కూల్‌లో అక్టోబర్‌ 30వ తేదీన  ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరు ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో శాన్‌రామన్‌, డబ్లిన్‌, ట్రైవ్యాలీ, కాలిఫోర్నియా నుంచి వచ్చిన తెలుగువారు ఎందరో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన కళాకారులను అభినందించారు. కోవిడ్‌ జాగ్రత్తలతో ఈ వేడుకలు జరిగాయి.  

ఈ వేడుకల్లో ప్రజంటింగ్‌ స్పాన్సర్‌గా సంజయ్‌ ట్యాక్స్‌ప్రో, రియల్టర్‌ నాగరాజ్‌ అన్నియా సమర్పణ, గోల్డ్‌ స్పాన్సర్స్‌గా శ్రీని గోలి రియల్‌ ఎస్టేట్స్‌, పిఎన్‌జి జ్యూవ్వెల్లర్స్‌, అపెక్స్‌ కన్సల్టింగ్‌, సిల్వర్‌ స్పాన్సర్‌గా ఆజాద్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ట్రావెలోపాడ్‌ వ్యవహరించాయి. తానా, పాఠశాల ఈ వేడుకలకు మద్దతిచ్చాయి. ఫుడ్‌ స్పాన్సర్స్‌గా శ్రీ స్‌ కిచెన్‌, కేక్స్‌ అండ్‌ బేక్స్‌ ఉన్నాయి. మీడియా పార్టనర్స్‌గా విరిజల్లు, బాలీ 92.3 ఎఫ్‌ఎం, తెలుగు టైమ్స్‌, వ్యవహరించాయి. వేడుకల్లో దుస్తులు, జూవ్వెల్లరీ, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషనల్‌, హెల్త్‌కేర్‌ వాళ్ళు బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. శాన్‌రామన్‌ సిటీ మేయర్‌, కౌన్సిల్‌ సభ్యులు ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించిన బాటాను అభినందించారు.

బాటా డ్యాన్స్‌ ఐడల్‌, మామ్‌ అండ్‌ డాటర్‌ ఫ్యాషన్‌ షో, ఫ్యాన్సీ డ్రస్‌, దీపాత్సోవం పేరుతో నిర్వహించిన లైట్‌ షో, ఆనంద భైరవి నృత్యరూపకం, కార్నివాల్‌ గేమ్స్‌, అమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌, సూపర్‌హిట్‌ ఢమాకాగా బాటా కరవోకె సింగర్స్‌ పాడిన పాటలు, యూత్‌ డ్యాన్స్‌, దివాళీ దాండియాలాంటి ఉత్సాహాభరితమైన కార్యక్రమాలతోపాటు, ఫుడ్‌ మేళా, వ్యాపార సంస్థల బూత్‌లు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులకు యోగ్యతా పత్రాలను కూడా బహుకరించారు.

ఈ వేడుకల కోసం బాటా కల్చరల్‌ కమిటీ నాయకులు వివిధ చోట్ల శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఫ్రీమాంట్‌, శాన్‌రామన్‌, డబ్లిన్‌, మిల్‌పిటాస్‌, కుపర్టినో, శాన్‌హోసె ప్రాంతాల్లో ఈ శిక్షణను నిర్వహించి కళాకారుల ప్రతిభకు మెరుగులుదిద్దారు.

ఈ వేడుకలను విజయవంతం చేసిన అందరికీ బాటా ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చికోటి ధన్యవాదాలు తెలిపారు.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు కొండల్‌రావు (వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ ముక్కా, శివ కడ, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి కల్చరల్‌ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి నామినేటెడ్‌ కమిటీ సభ్యులు హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు, సంకేత్‌, సందీప్‌ యూత్‌ కమిటీ సభ్యులు ఆదిత్య, హరీష్‌, ఉదయ్‌, క్రాంతి బాటా అడ్వయిజరీ బోర్డ్‌ నాయకులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి బాటా టీమ్‌ను అభినందించారు.

తానా సెక్రటరీ సతీష్‌ వేమూరి, తానా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ రామ్‌ తోట తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
  

Click here for Event Gallery

 

Tags :