వైఎస్ఆర్సీపీ ప్లీనరి విజయవంతం చేస్తాం : ఆర్ కృష్ణయ్య

వైఎస్ఆర్సీపీ ప్లీనరి విజయవంతం చేస్తాం : ఆర్ కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ కులాలకు శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలంతా వైఎస్‌ఆర్‌సీపికి అండగా ఉండాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరిని విజయవంతం చేస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీసీ కులాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా, బీసీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వరన్నారు. 56 కార్పొరేషన్‌ ద్వారా బీసీల అభివృద్ధికి బాటలు వేశారు.  దేశంలో చదవుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మరొకరు లేరన్నారు.  అమ్మఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు భవిష్యత్‌ ఇస్తున్నారన్నారు.

 

Tags :